దేశంలోనే మొదటి ఫిర్యాదు – ఫార్మసిస్టుల వృత్తి దుష్ప్రవర్తనపై నమోదు

ఫార్మసీ చట్టం 1948లో ప్రవేశపెట్టిన కూడా, ఫార్మసిస్టుల వృత్తి దుష్ప్రవర్తన పై ఫిర్యాదులు చేయవచ్చును అనే నిబంధనలు ఉన్నా కూడా దేశంలో ఏ ఒక్క ఫార్మసిస్ట్ పై ఇంతవరకు వృత్తి దుష్ప్రవర్తన పై ఫిర్యాదు ఫార్మసీ కౌన్సిల్ అందలేదు. ఫార్మసిస్టులు తమ ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మెడికల్ షాపుల యజమానులకు బాడుగలకు ఇచ్చి తమ వృత్తి విధులకు హాజరు కాకుండా మందులపై కనీస పరిజ్ఞానం లేనటువంటి వారితో మందులను ప్రజలకు జారీ చేయిస్తూ ప్రజా ఆరోగ్యాన్ని తోట్లు పొడుస్తూ, మరోవైపు ఫార్మసి వృత్తి ఔన్నత్వాన్ని దెబ్బతీస్తూ దశాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. ఇలా సర్టిఫికెట్లను బడుగు ఇచ్చే విధానంతో రోజు రోజు కూ ఫార్మసీ రంగంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉండడంతో నిరుద్యోగ ఫార్మసిస్టులు మరియు ఫార్మసీ విద్యార్థులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా ఏపీ ఫార్మా జెఎసి ఊరటనిస్తూ ఫార్మసిస్టుల వృత్తి దుష్ప్రవర్తనను చట్ట ప్రకారం ఫార్మసీ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయవచ్చునని ఒక నిర్దిష్ట ఫిర్యాదు పత్రాన్ని 2023 ఫిబ్రవరి 6వ తేదీన విడుదల చేసింది.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప పట్టణంలో ముగ్గురు మహిళా ఫార్మసిస్టులు తమ సర్టిఫికెట్లను మెడికల్ షాపుల యజమానులకు బాడుగలకు ఇచ్చి, ప్రజలకు మందులు జారీ చేయకుండా సదరు ఫార్మసీకి వృత్తి బాధ్యతలకు గైర్హాజరవుతూ, తమ ఫార్మసీ వృత్తి బాధ్యతలను నాన్ క్వాలిఫైడ్ వారికి అప్పగించి వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నారని డా. సుమన్ అనే మరో ఫార్మసిస్టు రాష్ట్ర మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ల రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేసి సదరు ఫార్మసిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరారు.

ఫార్మసీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ ఫిర్యాదును స్వీకరించి సదరు ఫార్మసిస్టులకు ఫార్మసీ కౌన్సిల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందు హాజరు కమ్మని సదరు రాష్ట్ర మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్లు నోటీసులు జారీ చేస్తాయా ? లేక ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్లు నేరుగా రంగంలోకి దిగి ఎంక్వయిరీ చేస్తారా ? లేక ఎవరైనా అధికారిని నియమిస్తారా ? లేదా కమిటీని వేసి విచారణ జరిపిస్తారా ? లేక ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు అప్పగించి ఫిర్యాదు పై విచారణ జరిపిస్తారా ? వేచి చూడాలి.

ఫార్మసీ చట్ట ప్రకారం ఫార్మసిస్టులపై ఏవైనా ఫిర్యాదులు వస్తే ఫార్మసీ కౌన్సిల్ యొక్క రిజిస్ట్రార్ గారు అదే కౌన్సిల్లో ఫార్మసీ చట్టంలోని అధికరణ 26 ఏ కింద పబ్లిక్ సర్వంట్లు గా నియామకమైన ఫార్మసీ ఇంస్పెక్టర్లకు బదిలీ చేసి విచారణ జరిపిస్తారు. ఫార్మసీ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన రిపోర్టును రిజిస్ట్రారు కౌన్సిల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి బదులాయించి సదరు ఫార్మసిస్ట్ ల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు.

దేశంలో కేవలం ఒక తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్ర ఫార్మసీ కౌన్సిలర్లు తప్ప ఫార్మసీ ఇన్స్పెక్టర్లు ఫార్మసీ చట్టం 26 ఏ కింద నియామకం జరపలేదు. మరి ఫార్మసిస్టులపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను సదరు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ ఏ విధంగా విచారణ జరుపుతాయి. ఫార్మసీ చట్టాలను ఏ విధంగా అమలు చేస్తాయో వేచి చూడాలి.

ఫార్మసీ చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర మరియు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్లు దశాబ్దాల కాలంగా అవలంబిస్తూ వస్తున్న నిర్లక్ష్యానికి ఫార్మసీ రంగం మొత్తంగా కుదేలైంది. భయంకరమైన నిరుద్యోగితను ఫార్మసీ పట్టభద్రులు ఈ దేశంలో చవిచూస్తున్నారు. నిరుద్యోగానికి గల ముఖ్య కారణం ఫార్మసీ కౌన్సిల్ నిర్లక్ష్యమే కారణమని తెలుసుకొని చట్టాలమల కొరకు వృత్తి సంఘాల ద్వారా పోరాటాలు జరుపుతున్నారు. ఇదే క్రమంలోని ఏపీ ఫార్మా జేఏసీ వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న ఫార్మసిస్టులపై ఫిర్యాదు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Leave a Comment