వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల పై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.

మీకు మందులు ఇస్తున్నది క్వాలిఫైడ్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ యేనా?

విధిగా, వృత్తి బాధ్యతగా మందుల షాపులలో అందుబాటులో ఉండి ప్రజలకు మందులను జారీ చేయాల్సిన క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు. కేవలం తమ ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మందుల షాపులో యజమానులకు బాడుగలకు ఇచ్చి తాము మాత్రం తమ విధులకు గైర్హాజరవుతూ, మందులపై కనీస పరిజ్ఞానం లేని వారి చేత ప్రజలకు మందులను జారీ చేయించడం తో ఒక వైపు ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ, మరోవైపు ఫార్మసీ వృత్తి ఔన్నత్వాన్ని దెబ్బతీస్తూ, ఫార్మసీ రంగంలో నిరుద్యోగితకు కారణమవుతున్న చీడపురుగు లాంటి అమ్ముడుపోయిన ఫార్మసిస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.

ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ, ఫార్మసీ వృత్తికి వెన్నుపోటు పొడుస్తున్న రిజిస్టర్ ఫార్మసిస్టులపై ఫిర్యాదు చేయడానికి ఏపీ ఫార్మా జేఏసీ ఒక నిర్దిష్ట ఫిర్యాదు ఫారం ను ప్రవేశపెట్టింది. ఈ ఫిర్యాదు ఫారం లో నింపి ఎవరైనా సదురు ఫార్మసిస్టులపై వారు పాల్పడుతున్న వృత్తి దుష్ప్రవర్తన పై సెక్షన్ 14 బి ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ 2015 కింద రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రారు గారికి లేదా కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రారు గారికి లేదా ఇద్దరికీ ఈ ఫిర్యాదును ఈమెయిల్ ద్వారా పంపించవచ్చును.

ఇలా వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న ఫార్మసిస్టులపై సదరు ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రారులు ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ 2015 లోని సెక్షన్లు 13 డి, 13 జి, 14 ప్రకారం మరియు ఫార్మసీ చట్టం 1948 లోని సెక్షన్ 36 (ii) (iii) ప్రకారం సదరు ఫార్మసిస్టుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఫార్మసిస్ట్ రిజిస్టర్ నుంచి వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడిన ఫార్మసిస్టు యొక్క పేరును తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తీసివేసి ఫార్మసీ రంగంలో ఎక్కడ ఉద్యోగం చేసుకోకుండా కఠిన చర్యలు చేపడుతారు.

ఫార్మసీ వృత్తి రంగంలో భయంకరమైన నిరుద్యోగతకు కారణమైన ఫార్మసిస్టులు తమ సర్టిఫికెట్లను బాడుగలకు ఇచ్చే విధానాన్ని అరికట్టేందుకు ఏపీ ఫార్మసీ జేఏసీ ఈ ఫిర్యాదు పత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫార్మసీ వృత్తి ఔన్నత్వం కాపాడేందుకు, ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, ఫార్మసీ వృత్తి రంగంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు బాధ్యతగా ప్రతి నిరుద్యోగ ఫార్మసిస్టు, ప్రతి ఫార్మసీ విద్యార్థి, ఫార్మసి వృత్తి పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఫార్మసీ రంగ నిపుణుడు, ప్రజలు, ప్రజా సంఘాలు ఎవరైనా వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడుతున్న ఫార్మసిస్టుపై ఫిర్యాదు చేయవచ్చును.

వృత్తి డిష్ ప్రవర్తనకు పాల్పడుతున్న రిజిస్టర్డ్ ఫార్మసిస్టుపై ఫిర్యాదు చేయుటకు పిర్యాదు పత్రమును డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది బటన్ పై క్లిక్ చేయండి

Leave a Comment