
ఫార్మసీ విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించి, ఫార్మసీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా ఫార్మసీ విద్యను భారత దేశంలో అభివృద్ధి చెందించిన, అందుకొరకు కృషి చేసిన మహాదేవలాల్ స్క్రాఫన్ గారి జన్మదిన సందర్భంగా మార్చి 6 తేదీ భారత జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం గా జరుపుటకు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ నిర్ణయించినది. ఈ సందర్భంగా ఢిల్లీలోని విగ్యాన్ భవన్ నందు మార్చి ఆరవ తేదీ *ఫార్మా అన్వేషణ్ 2023* అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతున్నట్లు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశంలో ఫార్మసీరంగం అత్యంత అభివృద్ధి చెందిందని, భారతదేశ ఆరోగ్య రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, మందుల తయారీ అయితే నేమి, మందుల సరఫరా అయితే నేమి వైద్య ఆరోగ్య రంగంలో భారతీయ ఫార్మసిస్టుల కృషి ఎనలేనిది అని, కోవిడ్ సమయంలో కూడా ఫార్మసిస్టులు మందుల షాపులలో అందుబాటులో ఉండి కరోనా ఆపత్కర పరిస్థితులలో ప్రజలను కాపాడడంలో భారతీయ ఫార్మసిస్టులు అద్భుతమైన కృషి చేశారని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అన్నారనీ కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ కొనియాడింది.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఫార్మసీ విద్యలో మూడు రకాల కోర్సులను భారతదేశంలో అందిస్తున్నట్లు. అత్యంత ప్రమాణాలు కలిగిన ఫార్మసీ కళాశాలలకే ఒక పకడ్బందీ వ్యవస్థతో అనుమతులు ఇచ్చి ఫార్మసీ విద్యను అందిస్తున్నామని కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ చెప్పుకొచ్చింది. డి ఫార్మసీ బి ఫార్మసీ మరియు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ వంటి మూడు రకాల కోర్సులను ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత దేశంలోనే అందిస్తున్నామని కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ చెప్పింది. ఇటువంటి అద్భుతం ఈ ప్రపంచంలో ఎక్కడా చోటు చేసుకోలేదని కొనియాడింది. ఫార్మసీ విద్యార్థి అభ్యసించి పట్టాలు పొంది బయటకు వస్తున్న ఫార్మసిస్టులు 100% ఉద్యోగ అవకాశాలు పొందుతూ అటు రిటైల్ ఫార్మసీ రంగంలోనే కాక ఫార్మసీటికల్ పారిశ్రామిక రంగంలో కూడా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఫార్మసీ కౌన్సిల్ చెప్పుకొచ్చింది.
ఫార్మసీ అకాడమిక్ రంగంలో ఫార్మసీ రీసెర్చ్ ద్వారా భారతీయ అకాడమిక్ ఫార్మసిస్టులు ఎన్నో అద్భుతాలు సృష్టించారని… వాటన్నిటిని మార్చి ఆరవ తేదీ జరగబోయే ఫార్మా అన్వేషణ్ 2023 కార్యక్రమంలో ప్రదర్శించనున్నామని అన్నారు.
ఫార్మా అన్వేషణ్ అనే కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది మేధావులు భారతీయ ఫార్మసీ వ్యవస్థను దగ్గరగా గమనించడానికి వస్తున్నారని చెప్పింది. భారతీయ ఫార్మసీ వ్యవస్థను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలు ముందుకు నడవాలని కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ సూచించింది.